: పొగాకు వాడకంతో పోగొట్టుకొనేదెంతో: వీవీఎస్ లక్ష్మణ్


పొగాకు వాడకం మనిషిని కుంగదీస్తుందని, ధూమపానంతో ఆరోగ్యంతో పాటు నిత్య జీవితంలో చాలావాటిని పోగొట్టుకోవలసి వస్తుందని ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ చెప్పారు. హైదరాబాదులో కామినేని ఆసుపత్రి ఆధ్వర్యంలో పొగాకు వ్యతిరేక దినం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీవీఎస్ లక్ష్మణ్ ముఖ్యఅతిథిగా హాజరై, నగరంలోని చైతన్యపురి నుంచి ఇండోర్ స్టేడియం వరకు సాగిన ర్యాలీలో పాల్గొన్నారు. తాము ఎంచుకున్న లక్ష్యాలను సాధించడానికి పొగాకు వాడకం అవరోధమనే విషయాన్ని యువతరం గుర్తించాలని లక్ష్మణ్ అన్నారు.

  • Loading...

More Telugu News