: రూ.339లతో చెన్నై నుంచి బెంగళూరుకు విమానంలో
చెన్నై నుంచి బెంగళూరుకు కేవలం 339 రూపాయలతోనే ఎంచక్కా విమానం ఎక్కి వెళ్లిపోవచ్చు. దేశంలో కొత్తగా విమానయాన సేవలు ప్రారంభించిన ఏయిర్ ఆసియా ఈ సదుపాయం అందిస్తోంది. ప్రారంభ ఆఫర్ కింద ఈ రోజు, రేపు (జూన్1) టికెట్లు బుక్ చేసుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అదే బెంగళూరు నుంచి చెన్నైకి రావాలంటే టికెట్ చార్జీని 490 రూపాయలుగా ఖరారు చేశారు.