: జగన్ నివాసానికి వచ్చిన బుట్టా రేణుక
కొద్ది రోజుల క్రితం కర్నూలు ఎంపీ బుట్టా రేణుక పతాక శీర్షికల్లో నిలిచిన విషయం తెలిసిందే. వైకాపా తరపున ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన రేణుక టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబును కలుసుకున్న ఆమె భర్త టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అదే రోజు సాయంత్రం తన భార్య రేణుక కూడా టీడీపీలో చేరుతారని ఆయన చెప్పారు. అయితే, చంద్రబాబుతో భేటీ అనంతరం ఆమె టీడీపీలో చేరనని... వైకాపాలోనే కొనసాగుతానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, దీనికి గల కారణాలు బయటకు వెల్లడవలేదు. ఈ నేపథ్యంలో, ఈ రోజు ఆమె వైకాపా అధినేత జగన్ నివాసానికి చేరుకున్నారు. కాసేపట్లో వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆమె ఇక్కడకు విచ్చేశారు. సమావేశానికి ఆమె రాక ప్రాధాన్యతను సంతరించుకుంది.