: కొంత మంది తెలంగాణ ప్రజలకు సోయి లేదు: నాయిని


ఇప్పటికీ కొంత మంది తెలంగాణ ప్రజలకు సోయి (తెలివి) లేదని టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి వల్లే కొందరు నాయకులు ఓడిపోవాల్సి వచ్చిందని అన్నారు. హైదరాబాదులోని ముషీరాబాద్ లో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. లోపం ఎక్కడుందో తెలుసుకుని పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కేసీఆర్ కట్టుబడి ఉన్నారని చెప్పారు. పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ ను అడ్డుకుంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News