: మోడీ సతీమణి జశోదాబెన్ కు పోలీసు భద్రత
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సతీమణి జశోదాబెన్ కు పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ఐదుగురు సభ్యుల పోలీసు బృందం నిరంతరం ఆమెకు భద్రత కల్పిస్తుంది. గుజరాత్ లోని మెహసానా జిల్లాలోని ఉంజ పట్టణంలో గల బ్రాహ్మణవాడలో నివసిస్తున్న ఆమె నివాసం వద్ద నిన్నటి (గురువారం) నుంచే ఐదుగురు సభ్యుల బృందాన్ని మోహరించారు. 24 గంటలపాటు ఆమె ఈ భద్రతా వలయంలో ఉంటారు. ప్రస్తుతం జశోదాబెన్ తన సోదరుడితో కలసి ఉంటోంది. అయితే గాంధీనగర్ లో తన చిన్న కుమారుడి వద్ద ఉంటున్న మోడీ తల్లికి ఇంతవరకు ఎటువంటి భద్రత కల్పించలేదు. ఈ విషయమై కేంద్రం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని గాంధీనగర్ కు చెందిన సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.