: కడప జిల్లాలో చెరువు పనుల కోసమంటూ రూ.4 కోట్లు నొక్కేశారు!
కడప జిల్లాలో చెరువు పనులు, చెక్ డ్యాముల నిర్మాణాల్లో అవకతవకలు జరిగినట్లు ఉన్నతాధికారుల విచారణలో వెల్లడైంది. దీనికి సంబంధించి చిన్ననీటి పారుదల శాఖకు చెందిన 10 మంది ఇంజినీర్లను సస్పెండ్ చేశారు. రూ. 4 కోట్ల విలువైన పనులను చేయకుండానే, చేసినట్లు బిల్లులు పెట్టి ఈ అక్రమాలకు తెరలేపినట్లు సమాచారం.