: వొడాఫోన్ వివాదం పరిష్కరించాకే ఆదాయపన్ను చట్టం సవరణలు : చిదంబరం


వొడాఫోన్ పన్నువివాదం పరిష్కారం అయిన తర్వాతే ప్రభుత్వం ఆదాయ పన్నుచట్టం సవరణలు చేపడుతుందని కేంద్ర ఆర్ధికమంత్రి పి.చిదంబరం చెప్పారు. కాగా, రాయితీ వంటగ్యాస్ కు త్వరలో నగదు బదిలీ పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని 2013-14 ఆర్ధిక సంవత్సరానికి దేశవ్యాప్తంగా తీసుకొస్తామని చెప్పారు. 2012-13లో రూ.10,38,987 కోట్ల రూపాయల పన్ను లక్ష్యాన్ని సాధించినట్లు వెల్లడించారు. అలాగే 2013-14లో రెవెన్యూ లక్ష్యాలను సాధిస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన చిదంబరం... చక్కెరపై నియంత్రణ ఎత్తివేయడంవల్ల వార్షిక రాయితీ రూ.2,500 కోట్లపైనే చేరిందన్నారు. నియంత్రణ ఎత్తివేతతో రైతుకు, పరిశ్రమకు లబ్ది చేకూరుతుందని వివరించారు.

  • Loading...

More Telugu News