: గ్రేటర్ హైదరాబాదులోని ప్రభుత్వ భవనాల పంపిణీ
గ్రేటర్ హైదరాబాదులోని ప్రభుత్వ భవనాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ ప్రభుత్వం ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ, మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలను పంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాత అసెంబ్లీ, ప్రస్తుత కౌన్సిల్ భవనాలు ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంగా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ను కేటాయించారు.
ఇప్పుడున్న అసెంబ్లీ భవనం, జూబ్లీహాల్ ను తెలంగాణకు కేటాయించారు. ఎమ్మెల్యేల క్వార్టర్స్ లో 1 నుంచి 10, 24 బ్లాకులు తెలంగాణకు కేటాయించారు. అలాగే, 11 నుంచి 19 బ్లాకులు 20 నుంచి 23 బ్లాకులను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు.
ఇక మినిస్టర్ క్వార్టర్స్ లోని 1 నుంచి 15 బ్లాకులు తెలంగాణకు కేటాయించారు. అలాగే 16 నుంచి 30 బ్లాకులను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు.