: కేసీఆర్ రాజీనామాకు ఆమోదం
మెదక్ ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన రాజీనామా ఆమోదం పొందింది. లోక్ సభ జనరల్ సెక్రెటరీ రాజీనామాను ఆమోదించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించబోతున్న నేపథ్యంలో... ఎంపీ పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. గజ్వేల్ శాసనసభ సభ్యుడిగా కొనసాగుతారు.