: నీటి ఎద్దడి నివారణకు నెలకు రూ. 80 లక్షలను కేటాయించిన టీటీడీ
తిరుపతి అన్నమయ్య భవన్ లో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పాలక మండలి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. తిరుమలలో నీటి ఎద్దడి నివారణకు నెలకు రూ. 65 నుంచి 80 లక్షలు ఖర్చు చేయాలని నిర్ణయించారు. లడ్డూల కొరత లేకుండా తయారీ సిబ్బందిని పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 186 మంది అటవీ శాఖ సిబ్బందిని నియమించనున్నారు. 6 నెలలకు సరిపడా 30.64 లక్షల కిలోల బియ్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అందుకోసం 12.85 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. 32 కంపార్ట్ మెంట్లలో టీవీలను ఏర్పాటు చేసేందుకు రూ. 2.50 కోట్లను ఖర్చు చేస్తారు.