: రవాణా శాఖ వెబ్ సైట్ రెండు రోజుల పాటు పనిచేయదు
రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రోజుల పాటు రాష్ట్ర రవాణా శాఖ వెబ్ సైట్ మార్పులు చేపట్టారు. దీంతో రేపు, ఎల్లుండి ఆ శాఖ వెబ్ సైట్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక వెబ్ సైట్లను రవాణా శాఖ రూపొందిస్తోంది. జూన్ 2వ తేదీ నుంచి రెండు రాష్ట్రాలకు వేర్వేరు వెబ్ సైట్లు అందుబాటులోకి రానున్నాయి.