: బిల్లులో ప్రస్తావించిన అంశాలను వెంటనే పూర్తిచేయాలి: చంద్రబాబు
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో చంద్రబాబు భేటీ ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు... సీమాంధ్ర ఆర్థిక పరిస్థితులను అరుణ్ జైట్లీకి వివరించానని చెప్పారు. విభజన బిల్లులో ప్రస్తావించిన అన్ని అంశాలను వెంటనే పూర్తి చేయాలని కోరామన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన రాయితీలపై స్పష్టత ఇవ్వాలని... బిల్లులో పొందుపరిచిన అన్ని అంశాలను వెంటనే అమలు చేయాలని విన్నవించినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి తాము సహకరిస్తామని ఈ సందర్భంగా జైట్లీ హామీ ఇచ్చినట్టు చంద్రబాబు చెప్పారు.