: అవినీతే కొంపముంచుతోంది: రాష్ట్రపతి


దేశంలో అవినీతి మహమ్మారి ప్రజాస్వామ్యానికే ముప్పుగా పరిణమించిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఇది చాలా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుందని తెలిపారు. న్యూఢిల్లీలో సీబీఐ స్వర్ణోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిధిగా పాల్లొన్న ప్రణబ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన సీబీఐ వ్యవస్థాపకుడు డీపీ కోహ్లీ స్మారకోపన్యాసం చేశారు. దేశంలోని పేదలకు అన్ని రంగాల్లో చేయూతనివ్వాల్సి ఉందన్నారు. సమర్థమైన పాలన లేకపోవడమే సమాజంలోని అనేక రుగ్మతలకు కారణమన్నారు.

  • Loading...

More Telugu News