: గుంటూరు యార్డులో పత్తి రైతుల ఆందోళన
అకాల వర్షాలు పత్తి రైతులను నిండా కష్టాల్లో ముంచాయి. గురువారం సాయంత్రం, ఈ ఉదయం కురిసిన వర్షం వల్ల గుంటూరు ఎనుమాముల మార్కెట్ యార్డులో పత్తి, మిర్చి బస్తాలు తడిసి ముద్దయ్యాయి. సుమారు 80 వేల బస్తాల పత్తి తడిసిపోయింది. ఇప్పటికే కొనేవారు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులను ఇది మరింత బాధకు గురి చేసింది. మరోవైపు సీసీఐ అధికారులు 15 రోజుల పాటు పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో రైతులు మార్కెట్ యార్డులో ఆందోళనకు దిగారు. తడిసిన పత్తిని కొనాల్సిందేనంటూ డిమాండు చేస్తున్నారు.