: ఏపీ డిప్యూటీ సీఎంగా నారాయణ విద్యాసంస్థల అధినేత?


ఆంధ్రప్రదేశ్ కు ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమిస్తానని ఎన్నికల సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన డిప్యూటీల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణ పేరు ఒక్కసారిగా తెరమీదకు వచ్చింది. కాపు సామాజిక వర్గానికి చెందిన నారాయణ కూడా డిప్యూటీ రేసులో ఉన్నారని సమాచారం.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో నారాయణ పోటీ చేయనప్పటికీ... టీడీపీ తరపున ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతను స్వీకరించారు. దీంతో, డిప్యూటీల లిస్టులో నారాయణ పేరును కూడా బాబు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని చంద్రబాబు సన్నిహితులు కూడా చూచాయగా అంగీకరిస్తున్నారు. ఒక వేళ నారాయణ డిప్యూటీ సీఎంగా ఎంపికయితే ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా గెలుపొందాల్సి ఉంటుంది. లేకపోతే ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసే అవకాశం కూడా ఉంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News