: ‘తురుం’ సినిమా హీరోయిన్ పోలీసులకు ఫిర్యాదు
తన అసభ్యకరమైన ఫోటోలను వెబ్ సైట్లలో పెడుతున్నారంటూ ఇటీవల సినీ హీరోయిన్ శృతి హాసన్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది.
‘తురుం’ సినిమా హీరోయిన్ హైదరాబాదు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి యూట్యూబ్ లో పెట్టారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.