: వైకాపా కార్యకర్తలపై టీడీపీ దాడులను సహించం: అంబటి
టీడీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని వైకాపా నేత అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి టీడీపీ దాడులు ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. ఇకపై వైకాపా కార్యకర్తలపై దాడులు జరిగితే సహించమని హెచ్చరించారు. ఈరోజు నెల్లూరు జిల్లా వైకాపా ఎమ్మెల్యేలు, నేతల సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.