: ఔటర్ పై ఘోర రోడ్డు ప్రమాదం...నుజ్జునుజ్జయిన కారు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హోర్డింగ్ ను గుద్దుకుని కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. కాగా, వీరి మృతదేహాలు కారులో ఇరుక్కుపోయాయి. వాటిని వెలికి తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వీరి వివరాలు తెలియాల్సి ఉంది.