: వైమానిక రంగాన్ని సమస్యల్లోంచి బయటకు లాగాలి: అశోక్ గజపతిరాజు


పౌరవిమానయాన రంగాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, వైమానిక రంగంలో సమస్యలు ఉన్నాయని, వాటికి ముందుగా పరిష్కారాలు చూపిస్తామని అన్నారు. ప్రైవేటు విమానయాన సంస్థలు నాణ్యమైన సేవలు అందించాలని ఆయన సూచించారు. ప్రైవేటు వైమానిక రంగం అన్ని సవాళ్లను స్వతంత్రంగా ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తమ పరిపాలన పారదర్శకంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News