: అధికారం అడ్డుపెట్టుకుని పేరు మార్చుతారా?: వీహెచ్


రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెడతామనడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, అధికారం ఉంది కదాని పేరు మార్చడం మంచి సంప్రదాయం కాదని అన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు పేరు మారిస్తే చూస్తూ ఉరుకోమని హెచ్చరించారు. కావాలంటే విశాఖ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టుకోవాలని ఆయన సూచించారు. ఇదే ఆనవాయతీని కొనసాగిస్తే చాలా చోట్ల పేర్లు మార్చాల్సి వస్తుందని మండిపడ్డారు. విశాఖలో రాజీవ్ స్మృతి భవన్ ను కల్యాణ మండపంగా మార్చవద్దని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News