: తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం సిద్ధం


కొన్ని రోజుల్లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడబోతున్న తెలంగాణకు అధికారిక చిహ్నం సిద్ధమైంది. ముందుగా తెలంగాణకు సంబంధించి కాకతీయ శిలా తోరణం, దాని మధ్యలో హైదరాబాదు రాజధానిని గుర్తు చేసేలా చార్మినార్ చిహ్నం ఉండేలా లోగోను రూపొందించారు. ఇందులో కాకతీయ తోరణంపై భారతదేశ అధికారిక చిహ్నంగా ఉండే అశోక చక్రంపై ఉండే మూడు సింహాల గుర్తు ఉంటుంది. ఇక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఆంగ్లం, తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, ఉర్దూ భాషలలో రాజముద్ర వేయించారు. జూన్ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కేసీఆర్ దీనిని ఆమోదించినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News