: షారూక్ ను అభినందించిన మమతాబెనర్జీ
ఐపీఎల్ క్వాలిఫయింగ్ మ్యాచులో కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించి ఫైన్సల్ లో అడుగుపెట్టడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ.. జట్టు యజమాని అయిన షారూక్ ను అభినందించారు. షారూక్ పశ్చిమబెంగాల్ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేస్తున్నారు. నిన్న రాత్రి కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్ ముగిసిన తర్వాత షారూక్ మమతా ఇంటికి వెళ్లి ఆమెను కలుసుకున్నారు. ఈ సందర్భంగానే ఆమె షారూక్ ను అభినందించారు. 'కోల్ కతా నైట్ రైడర్స్ అద్భుత విజయం సాధించింది. జట్టుకు నా అభినందనలు. ఫైనల్స్ లోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అంటూ మమతాబెనర్జీ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. షారూక్ కు, ఆయన కుటుంబ సభ్యులకు తన శుభాకాంక్షలంటూ అందులో పేర్కొన్నారు.