: కేసీఆర్ హీరో అయిపోదామని వింతపోకడలకు పోతున్నాడు: సోమిరెడ్డి


తెలంగాణలో హీరో అయిపోదామని కేసీఆర్ వింత పోకడలకు పోతున్నాడని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని గుర్తు చేశారు. అన్నీ తెలిసిన కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టేందుకు నాటకాలు ఆడుతున్నాడని అన్నారు. ఇలాగే తెలంగాణలో అరాచకం కొనసాగేలా చేస్తే ఏం చేయాలో ప్రజలకు తెలుసని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News