: చంద్రబాబు... నోటికి ఏదొస్తే అది మాట్లాడకు : బొత్స


అధికారం ఉందని శంషాబాద్ విమానాశ్రయం పేరును మారిస్తే... మరో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ ఆ పేరును మార్చే ప్రమాదం వుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సున్నితంగా హెచ్చరించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ పేరు బేగంపేట విమానాశ్రయానికి ఉండేదని, ఇప్పుడు శంషాబాద్ విమానాశ్రయం పేరు 'రాజీవ్ గాంధీ అతర్జాతీయ విమానాశ్రయం' అని ఆయన అన్నారు. చంద్రబాబు నోటికి ఏదొస్తో అది మాట్లాడుతున్నాడన్న బొత్స, ఆయన తెలిసి మాట్లాడుతున్నారో, లేక తెలియక మాట్లాడుతున్నారో తెలియడం లేదని అన్నారు. విమానాశ్రయం పేరు మార్పు కేంద్ర ప్రభుత్వ వ్యవహారమని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News