: సాయంత్రం రాష్ట్రపతిని కలవనున్న టీఆర్ఎస్ ఎంపీలు


పోలవరం ముంపు ప్రభావిత మండలాలను సీమాంధ్రలో కలుపుతూ ఆర్డినెన్స్ వెలువడటంపై టీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఒకరోజు తెలంగాణ బంద్ కు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అంతేకాకుండా, ఈ రోజు సాయంత్రం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో టీఆర్ఎస్ ఎంపీలు భేటీ కానున్నారు. ఈ సాయంత్రం 7.15 గంటలకు వారికి అపాయింట్ మెంట్ లభించింది. ఈ సందర్భంగా ఆర్డినెన్సును వ్యతిరేకిస్తూ రాష్ట్రపతికి వీరు తమ అభ్యంతరాలను వ్యక్తపరుస్తారు. ఆర్డినెన్సును తిప్పిపంపాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తారు.

  • Loading...

More Telugu News