: పోలవరంపై ఆర్డినెన్స్ తేవడంలో తప్పులేదు: మైసూరారెడ్డి
పోలవరంపై ఆర్డినెన్స్ తేవడంలో తప్పులేదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఏడు ముంపు మండలాల బాధితులకు న్యాయం జరగాలంటే వాటిని ఆంధ్రప్రదేశ్ లోనే కలపాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ బంద్ టీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం అని ఆయన స్పష్టం చేశారు.