: అమెరికాలో ఆంధ్రా యువకుడు మృతి


అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లిన ఓ ఆంధ్రా యువకుడు మృతి చెందాడు. ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన సందీప్ రెడ్డి ప్రమాదవశాత్తు జలపాతంలో పడి మరణించాడు. కేఎల్ వర్శిటీలో బీటెక్ చేసిన సందీప్ ఎంఎస్ చదవటానికి అమెరికా వెళ్లాడు. ఫస్ట్ సెమిస్టర్ పూర్తి చేసిన ఈ కుర్రాడు డెలావర్ మిలిటెంట్ లో ఉంటున్న బాబాయ్ శ్రీనివాసరెడ్డి వద్దకు వెళ్లాడు. శ్రీనివాసరెడ్డితో పాటు మిత్రులతో కలిసి దగ్గర్లోని జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన సందీప్ ప్రమాదవశాత్తు జలపాతంలో పడిపోయాడు. అతడిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. కోమాలోకి వెళ్లిన సందీప్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.

  • Loading...

More Telugu News