: హిందూపురం నియోజకవర్గ నేతలకు బాలకృష్ణ విందు
అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన టీడీపీ నేత, సినీనటుడు బాలకృష్ణ ఈ రోజు తన నియోజకర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో నియోజకవర్గ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం హిందూపురం నేతలకు ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు.