: గంగానదిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తా: ఉమాభారతి
గంగానదిని పూర్తి స్థాయిలో శుద్ధి చేస్తానని కేంద్ర జలవనరుల శాఖామంత్రి ఉమాభారతి ప్రతిజ్ఞ చేశారు. ఒక్క గంగానదే కాదు, దేశంలోని ప్రతి నదీ స్వచ్ఛంగా ఉండి, ప్రజల అవసరాలను తీర్చాలని ఆమె ఆకాంక్షించారు. వారణాసి నుంచి లోక్ సభకు ఎన్నికైన ప్రధాని నరేంద్ర మోడీ గంగానది పవిత్రతను కాపాడటం తన ప్రభుత్వ ప్రాధాన్యమని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకోసం ఆయన జలవనరుల శాఖలోనే ‘గంగా ప్రక్షాళన’నూ భాగం చేసి, ఆ పనిని ఉమాభారతికి అప్పగించారు.
బుధవారం నాడు ఉమాభారతి జలవనరులు, గంగా ప్రక్షాళనా శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దేశంలో ప్రవహించే ప్రతి నదిని కాలుష్య రహితంగా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళికని రూపొందించనున్నట్లు ఆమె చెప్పారు. తనకీ బాధ్యత అప్పగించిన మోడీకి ఉమాభారతి ధన్యవాదాలు తెలిపారు.