: కేంద్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి జానారెడ్డి మండిపాటు
కేంద్రప్రభుత్వంపై మాజీ మంత్రి జానారెడ్డి మండిపడ్డారు. పోలవరంపై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ను తీసుకురావడం తొందర పాటు చర్య అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్డినెన్స్ తో కేంద్రం ఓ ప్రాంతం వైపు మొగ్గు చూపుతోందనే భావన కలుగుతోందని అన్నారు. రెండు ప్రభుత్వాలు ఏర్పాటయిన తర్వాత దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని జానా అన్నారు.