: మా వాళ్ళనూ ఐపీఎల్ లో ఆడనివ్వండి: అక్రమ్


పాకిస్తాన్ క్రికెటర్లను ఐపీఎల్ లో ఆడనివ్వకపోవడం పట్ల లెజండరీ పేసర్ వసీం అక్రమ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. లీగ్ లో ఆడేందుకు పాక్ ఆటగాళ్ళకు అనుమతి ఇవ్వాలని అక్రమ్ నేడు బీసీసీఐని కోరాడు. జనరంజకంగా తయారైన ఐపీఎల్ లో పాక్ క్రికెటర్ల ప్రవేశం.. టోర్నీని మరింత ఆకర్షణీయంగా మలుచుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అక్రమ్ ప్రస్తుతం కోల్ కతా నైట్ రైడర్స్ కు బౌలింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. కాగా, గత ఐదు సీజన్లుగా ఐపీఎల్ లో దాయాది క్రికెటర్లపై అప్రకటిత నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఈ విషయమై అక్రమ్ స్పందిస్తూ, 'క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టరాదని ప్రగాఢంగా విశ్వసిస్తాను' అని చెప్పాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పాక్ కోచ్ లు, కామెంటేటర్లు, అంపైర్లను ఐపీఎల్ కు అనుమతించిన బీసీసీఐ.. ఆటగాళ్ళ విషయానికొచ్చేసరికి కఠిన వైఖరి అవలంబిస్తోంది. పాక్ ఆటగాళ్ళను లీగ్ లోకి తీసుకుంటే కాసుల వర్షం కురిపించే ఈ టోర్నీకి ఫిక్సింగ్ జాఢ్యం అంటుకునే ప్రమాదం ఉందని భావిస్తుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఎందుకంటే, పాక్ క్రికెటర్లు పలువురు ఇప్పటికే ఫిక్సింగ్ కుంభకోణాల్లో ఇరుక్కుని కెరీర్ నే ప్రమాదంలో పడేసుకున్నారు.

  • Loading...

More Telugu News