: పెళ్లి కోసం నాలుగేళ్లలో 26 దేశాల పర్యటన
బాగా ఉత్సాహం గల ఓ యువకుడు ఏం చేశాడో తెలుసా? ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు ప్రపంచాన్ని చుట్టొచ్చాడు. 21 ఏళ్ల జాక్ హైర్ తన ప్రియురాలు బెక్కా స్ట్రెల్లానర్ తో డేటింగ్ చేసిన తర్వాత ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దాన్ని భిన్నంగా ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. నాలుగేళ్ల పాటు 26 దేశాల్లో పర్యటించాడు. అన్ని ప్రముఖ చారిత్రక ప్రదేశాలను చూసి వీడియో తీశాడు. దాన్ని తీసుకెళ్లి బెక్కాకు చూపించి ప్రపోజ్ చేశాడు. ఆమె మనస్ఫూర్తిగా ఓకే చెప్పింది.