: ఢిల్లీ వెళ్లిన టీ పీసీసీ చీఫ్ పొన్నాల
తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఈ ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ ఓటమిపై అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్, దిగ్విజయ్ సింగ్ లకు సమగ్ర నివేదికలు సమర్పించనున్నారు. ఎన్నికల్లో ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని మేడంకు విన్నవించుకుంటారు. ఇప్పటికే ఓటమికి బాధ్యతగా రాజీనామా చేయాలని సొంత పార్టీ నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో అధ్యక్ష పదవికి లక్ష్మయ్య రాజీనామా ఇవ్వనున్నట్లు సమాచారం.