: అవినీతి అంతానికి ఈ నాలుగు పాటించండి: మంత్రులకు నిర్దేశించిన మోడీ


అవినీతి రహిత సమాజమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన మోడీ... అవినీతిపై ఉక్కుపాదం మోపబోతున్నారు. తన కుటుంబ సభ్యులను సైతం దూరంగా ఉంచే మోడీ... తన సహచర మంత్రుల దగ్గర నుంచి కూడా ఇదే కోరుకుంటున్నారు. మన దేశంలో అత్యంత అవినీతిమయమైన రంగం రాజకీయ రంగం. అందుకే తన మంత్రివర్గ సహచరులు అవినీతికి ఊతమందించేలా ప్రవర్తించకుండా ఉండేందుకు... తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో, మంత్రులకు నాలుగు మార్గ నిర్దేశకాలు జారీ చేశారు. అవి ఏమిటంటే...
1. బంధు ప్రీతిని తగ్గించుకోండి.
2. కుటుంబ సభ్యులను కాని, బంధువులను కాని వ్యక్తిగత సిబ్బందిగా నియమించుకోవద్దు.
3. ప్రజాసంబంధాలకు సంబంధించి పారదర్శకంగా వ్యవహరించండి.
4. బంధువులకు కాంట్రాక్టులను అప్పగించొద్దు.

  • Loading...

More Telugu News