: జనాల నడ్డి విరుస్తున్న ఆటోవాలాలు
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్టు... తెలంగాణ బంద్ జనాల చావుకొచ్చింది. బంద్ నేపథ్యంలో బస్సులన్నీ డిపోలకే పరిమితమైపోగా... ఆటోవాలాలు, సెట్విన్ బస్ ఆపరేటర్లు, క్యాబ్ వాలాలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. సాధారణ ఛార్జీల కంటే 10 రెట్లు అధికంగా వసూలు చేస్తూ... ప్రయాణికులను దోచుకునే పనిలో పడ్డారు. అడిగే వాడు లేడు... ఆపేవాడు లేడు. కళ్ల ముందు నిలువు దోపిడీ జరుగుతున్నా... నిలదీయలేని పరిస్థితి నెలకొంది.