: తిరుమల అడవుల్లో ముగ్గురు స్మగ్లర్ల కాల్చివేత
చిత్తూరు జిల్లాలో తిరుమల కొండలకు ఆనుకొని ఉన్న శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం చేపట్టిన పోలీసుల కూంబింగ్ రక్తసిక్తంగా మారింది. ఈ రోజు కూంబింగ్ చేస్తున్న పోలీసులకు స్మగ్లర్లు తారసపడ్డారు. వెంటనే పోలీసులపై స్మగ్లర్లు దాడులకు దిగారు. ఈ దాడుల్లో ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, పోలీసులు తమ తుపాకులకు పని చెప్పారు. ఈ కాల్పుల్లో ముగ్గురు స్మగ్లర్లు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారు అడవుల్లోకి పారిపోయారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు.