: జూన్ 2వ తేదీ నుంచి తెలంగాణలో రాష్ట్రపతి పాలన ఎత్తివేత


జూన్ 2వ తేదీన తెలంగాణలో రాష్ట్రపతి పాలన ఎత్తివేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కొనసాగుతుంది. జూన్ 2న తేదీన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చంద్రబాబు జూన్ 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అపాయింటెడ్ డే అయిన జూన్ రెండో తేదీన రాష్ట్ర విభజన సజావుగా సాగేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.

ముఖ్యమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన అనంతరం మార్చి ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలనలో ఉండగానే ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News