: లో దుస్తులపై దేవతల చిత్రాలు.. లక్నోలో ఆందోళన


రోజులు మారుతున్నాయి. మానవుడు సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాడు. దాన్ని సద్వినియోగం చేసుకునేవారుంటే.. దుర్వినియోగ పరిచే ఆకతాయిలూ ఉంటారు. మతాల మధ్య చిచ్చు పెట్టడానికి చిల్లర వేషాలు వేస్తూనే ఉంటారు. ఇలాంటిదే ఒక ఘటన లక్నోలో దాడులకు దారి తీసింది.

లో దుస్తులపై హిందూ దేవతలున్న చిత్రాలు ఫేస్ బుక్ లో వెలిశాయి. ఇది చూసిన రాకీ అనే అతడు భజరంగ్ దళ్, మరికొన్ని సంస్థలకు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానికంగా శుక్రవారం సాయంత్రం అలజడి రేగింది. ఇది మరో మత వర్గం వారి వివాహ వేడుకపై దాడి వరకూ వెళ్లింది. ఆ చిత్రాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళనకారులు స్థానిక బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ ముందు బైటాయించారు. పోలీసులు రాకీని ప్రశ్నించగా.. ఫేస్ బుక్ బాగోతం బయటపడింది. ఫేస్ బక్ లో అసభ్యకరమైన చిత్రాలు కనిపించాయని చెప్పాడు. వీటిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఆందోళనకారులకు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.

  • Loading...

More Telugu News