: రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు వారందరం ఒకటే: చంద్రబాబు


రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు వారందరం ఒక్కటిగా కలిసి ఉందామని చంద్రబాబు చెప్పారు. మహానాడులో ముగింపు ఉపన్యాసం చేస్తూ చంద్రబాబు... తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, తెలుగులో మాట్లాడగానే మనవాడు అంటూ కలుపుకుపోతారని అన్నారు. తెలుగుభాష ఒక అనుబంధమని, మతాలు, కులాలు వేరైనా తెలుగు భాష తెలుగు వారందరినీ ఒక్కటిగా కలిపి ఉంచుతుందని అన్నారు.

అభివృద్ధి, సంక్షేమంలో పోటీ పడదామని కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. ఒకరిపై ఒకరు విమర్శించుకోవడంలో అర్థం లేదన్నారు. టీఆర్ఎస్ వాళ్లు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరి కాదని ఆయన హితవు పలికారు.

  • Loading...

More Telugu News