: రూ.20 కోట్లతో కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు: చంద్రబాబు


టీడీపీ కార్యకర్తల సంక్షేమం కోసం ఓ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఈ నిధి కోసం మహానాడులో ప్రకటించగానే నేతలు, కార్యకర్తలు ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చారన్నారు. మహానాడులో రూ.14 కోట్లు విరాళాల రూపంలో సమకూరినట్లు... వీటికి తోడు ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఉన్న రూ. 6 కోట్లను కలిపి ఓ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఈ రూ.20 కోట్లను ఫిక్స్ డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీని కార్యకర్తల సంక్షేమానికి వినియోగించనున్నట్లు బాబు ప్రకటించారు.

  • Loading...

More Telugu News