: పోలవరం నిర్మాణంతో ఎవరికీ ఇబ్బంది ఉండదు: సబ్బం హరి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఎవరికీ ఇబ్బంది ఉండదని మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. దాన్ని ఆపే ప్రయత్నాలు చేయొద్దని టీఆర్ఎస్ కు సూచించారు. పోలవరాన్ని అడ్డుకుంటే హింసా మార్గాలకు వెనుకాడమని ఆయన హెచ్చరించారు. ముంపు ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు డిమాండ్ చేయొచ్చని విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు. ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపే ఆర్డినెన్స్ తో ఆంధ్రాకు ఎన్డీఏ న్యాయం చేసినట్లు తాను భావించడం లేదని సబ్బం అభిప్రాయపడ్డారు. న్యాయం చేయాలనుకుంటే రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల నిదులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.