: కేసీఆర్! టీడీపీని తిట్టడం కాదు... ఇవి చెయ్ : ఎర్రబెల్లి
ఎంతసేపూ టీడీపీని ఆడిపోసుకోవడమే కేసీఆర్ కు తెలిసిన విద్య అని, అయితే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన విషయం మర్చిపోయి ఇంకా టీడీపీని విమర్శిస్తున్నాడని టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి అన్నారు. మహానాడులో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఇంటికో ఉద్యోగం ఇవ్వడంపై దృష్టి సారించాలని అన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రతి ఇంటికీ 3 ఎకరాల భూమి ఇవ్వడాన్ని పూర్తి చేయాలని ఎర్రబెల్లి సూచించారు.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పేదలకు 3 లక్షల రూపాయలతో డబుల్ బెడ్రూం ఫ్లాట్ నిర్మించడంపై ప్రణాళికలు సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి జిల్లాలో లక్ష ఎకరాలను సస్యశ్యామలం చేయడంపై ఆలోచన చేయాలని కేసీఆర్ కు ఎర్రబెల్లి హితవు పలికారు.