: ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కనుక, అప్పట్లో ఆర్డినెన్స్ జారీ చేయలేదు...వివాదం చేయద్దు: కావూరి
పోలవరం ముంపు విషయంలో కేసీఆర్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కనుక అప్పట్లో ఆర్డినెన్స్ జారీ చేయలేదని అన్నారు. వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, రవిశంకరప్రసాద్ అప్పట్లో ప్రతిపక్షంలో ఉండగానే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకుందని కావూరి స్పష్టం చేశారు. ఇంకా చాలా నిర్ణయాలు ఉన్నాయని, అవన్నీ రాష్ట్ర విభజన సందర్భంగా తీసుకున్నవేనని, వాటిని వివాదం చేయడం శుద్ధ దండగని ఆయన అభిప్రాయపడ్డారు.