: శుక్రకణాలు చాలా ఫాస్ట్ గురూ!
ఏటికి ఎదురీదడంలో చేపలను మించినవి మరొకటుండవు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజా పరిశోధనలు అది తప్పని నిరూపించాయి. ఎదురీదడంలో శుక్రకణాల వేగం తిరుగులేనిదని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లెక్కల అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలిపారు. దీనిపై ఆయన పరిశోధనలు నిర్వహించారు. సరైన ప్రవాహ వేగాన్ని సృష్టించగలిగితే శుక్రకణాలు చాలా నిమిషాల పాటు ఎదురీదుతాయని శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు.
లక్షలాది శుక్రకణాల్లో చాలా తక్కువ మాత్రమే సరిగా ఈదలేవని, గమ్యాన్ని చేరుకోలేవని ఆయన వెల్లడించారు. అయితే శుక్రకణాలు సరైన దిశలో ఈదడమే కాకుండా, తమ పొడవు కంటే వెయ్యిరెట్లు ఎక్కువ దూరం వెళ్లగలవని ఆయన తెలిపారు. అవి వెళ్లే మార్గంలో రకరకాల రసాయనాలు కెరటాల రూపంలో ఎదురవుతాయని, వాటన్నింటినీ ఎదురీదుతూ శుక్రకణం అండాన్ని చేరుకుంటుందని ఆయన వివరించారు.
శుక్రకణాల సామర్థ్యాన్ని అర్థం చేసుకుని, అంచనా వేసేందుకు వివిధ పరిమాణాలు, ఆకారాల్లో ఉండే మైక్రో ఛానెళ్లను ఏర్పాటు చేసి పరిశోధనలు నిర్వహించారు. వాటిని ట్యూబుల్లో ఏర్పాటు చేసి, రసాయన ద్రవాలను కెరటాల రూపంలో వదిలి కెరటాల వేగానికి ఎలా స్పందిస్తాయో పరీక్షించారు.