: కాంగ్రెస్ అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోయారు: కొనకళ్ల నారాయణ
కాంగ్రెస్ పాలనలో దేశంలో అవినీతి పెరిగిపోయిందని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. మహానాడులో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ అవినీతితో ప్రజలు విసిగిపోయారన్నారు. అవినీతి రహిత భారత్ ను నిర్మిస్తానన్న నరేంద్ర మోడీకి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. మన రాష్ట్రానికి చెందిన వెంకయ్య నాయుడు, అశోక్ గజపతిరాజు, నిర్మలా సీతారామన్ లకు మంత్రి పదవులు ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన అభినందనలు తెలిపారు.