: కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం: నాయిని
కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని నాయిని నర్సింహారెడ్డి హెచ్చరించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఇద్దరు నాయుళ్లు కలిసి తెలంగాణను మోసం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ పిలుపు మేరకు పది జిల్లాల్లోను బంద్ ను విజయవంతం చేస్తామని నాయిని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుమ్మక్కై పోలవరం ముంపు మండలాలను ఆంధ్రలో కలుపుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలే వారికి బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.