: పేదరికాన్ని నిర్మూలించడమే నా లక్ష్యం: చంద్రబాబు


పేదరికాన్ని నిర్మూలించడమే తన లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. గండిపేటలో జరుగుతోన్న మహానాడులో ఆయన మాట్లాడుతూ... పేదరికం లేని సమాజం కోసం రేయింబవళ్లు పనిచేస్తానని అన్నారు. అనేక సందర్భాల్లో ఎన్టీఆర్ చెప్పిన ‘పేదలే నాకు దేవుళ్లు... సమాజమే నా దేవాలయం’ అన్న మాటల్ని ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. పేదరిక నిర్మూలన అయితే రైతులు బాగుపడతారని, చేతి వృత్తుల వారు బాగుపడతారని అన్నారు. పేదరిక నిర్మూలన కోసం అందరం కలిసి పనిచేద్దామని అన్నారు. పేదరిక నిర్మూలన తీర్మానానికి తమ ఆమోదాన్ని తెలపాలని కార్యకర్తలను కోరారు.

  • Loading...

More Telugu News