: తెలంగాణ గవర్నర్ గా నరసింహన్ కు అదనపు బాధ్యతలు
తెలంగాణ గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహన్ కు అదనపు బాధ్యతలు కేటాయించారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు రాష్ట్రపతి భవన్ తెలిపింది. రెండు రాష్ట్రాలకు శాశ్వత ఏర్పాట్లు చేసేంతవరకు ఈ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపింది.