: కోడల్ని వెతకమంటే కొట్టి 50 వేలు అడిగాడు: హెచ్చార్సీలో ఎస్సైపై ఫిర్యాదు
కోడలు తప్పిపోయిందని, ఆచూకీ వెతికి పెట్టాలని ఎస్సైని అడిగితే ఆయన 50 వేలు డిమాండ్ చేశారని బాలయ్య అనే వ్యక్తి మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు. కరీంనగర్ జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ లో బాలయ్య తన కోడలు తప్పిపోయిందని ఫిర్యాదు చేశాడు. తన కోడలి ఆచూకీ వెతికిపెట్టాలని ఎస్సైని కోరాడు. కేసు నమోదు చేయాలంటే 50 వేల రూపాయల లంచం ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేశాడని, ఎందుకని అడిగినందుకు తనను కొట్టాడని, ఆ ఎస్సైపై చర్యలు తీసుకోవాలని బాలయ్య హెచ్ఆర్సీని ఆశ్రయించాడు.