: అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనారోగ్యంతో ఇవాళ విశ్రాంతి తీసుకుంటున్నారు. జ్వరంతో ఆయన బాధపడుతున్నారని, దీంతో ఇవాళ్టి అపాయింట్ మెంట్లన్నీ రద్దు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ నుంచి హైదరాబాదుకు వచ్చిన కేసీఆర్ ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే కేసీఆర్ జ్వరంతో ఉండటంతో... వారంతా ఆయన్ను కలవకుండానే వెనుదిరుగుతున్నారు.